Grow Wheatgrass at Home | ఇంట్లో గోధుమ గడ్డి పెంచడం ఎలా, గోధుమ గడ్డితో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

6 months ago
17

#halfacrecultivation

గోధుమ గడ్డి రసం.. గ్రీన్ బ్లడ్!
ఇంటిల్లిపాదికి సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చేది గోధుమగడ్డి రసం. రక్తహీనతను చాలా వేగంగా పారదోలి రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసే అద్భుత లక్షణం దీనికి ఉంది. పోషకాల సాంద్రత గింజలో కన్నా మొలకలో, మొలకలో కన్నా గడ్డిలో చాలా రెట్లు ఎక్కువ. కూరగాయల రసంలో కన్నా గోధుమ గడ్డి రసంలో నేరుగా రక్తవృద్ధికి తోడ్పడే పోషకాలు 7, 8 రెట్లు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే దీన్ని గ్రీన్ బ్లడ్ అని పిలుస్తున్నారు. ఇటువంటి గోధుమ గడ్డిని ఇంటిపంటల్లో భాగంగా పండించుకోవటం చాలా సులభం.
కొబ్బరిపొట్టు మరియు వర్మీకంపోస్టు లేదా కంపోస్టు మరియు కొంచెం మట్టి కలిపిన మట్టి మిశ్రమం వాడొచ్చు. రెండు, మూడంగుళాల లోతు మట్టి మిశ్రమం చాలు. 8 లేదా 9 రోజుల్లో గోధుమ గడ్డి కోతకు వస్తుంది. రోజూ వరుసగా ఒక్కో ట్రేలో గోధుమ గింజలు చల్లుతూ ఉంటే 8 లేదా 9 రోజుల తర్వాత నుంచి రోజూ గోధుమ గడ్డి కోతకొస్తుంది. గింజలు రాత్రంతా నానబెట్టి, చల్లి, తేమ ఆరిపోకుండా ఉండేలా అవసరం మేరకు నీటిని చిలకరిస్తే చాలు. గోధుమ గడ్డికి ఎండ అసలు తగలకూడదు. ట్రేలు, ప్లాస్టిక్ గిన్నెల్లో ఇంట్లోనే సులభంగా పెంచుకోవచ్చు. చెట్ల కింద నీడలో మడుల్లో పెంచవచ్చు. 5 నుంచి 6 అంగుళాల ఎత్తు పెరిగిన గోధుమ గడ్డిని కత్తిరించి, మిక్సీలో వేసి రసం తీసి తాగాలి. అన్ని వయసుల వారూ పరగడుపున తాగొచ్చు. ఇంటిపంటలపై అవగాహన ఉన్నవారికి గోధుమ గడ్డిని పెంచటం అసలు సమస్యే కాదు.

Loading comments...