Amazing Health Benefits of Jackfruit | పనస యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు |

7 months ago
14

Amazing Health Benefits of Jackfruit | పనస యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు |

పనస తొనలు.. కాలానుగుణంగా వచ్చే ఈ పండును తీసుకుంటే కలిగే లాభాలు.
దీంట్లోని ఇనుము రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.
ఈ పండులో పొటాషియం అధిక మొత్తంలో ఉండి రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనిలోని ఖనిజ లవణాలు థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
దీనిలో వ్యాధినిరోధకతను పెంచే విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచడంతోపాటు చర్మ నిగారింపునకూ తోడ్పడుతుంది.
పనసలో ఫోలేట్, నియాసిన్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ లాంటి ఖనిజాలు ఉంటాయి.
క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేసే ఫైటో న్యూట్రియంట్స్ పనసలో పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ సమస్యని కూడా దూరం చేస్తుంది.
పనస గింజల్లో బోలెడు పోషకాలుంటాయి. పనస గింజలను కాల్చుకుని తింటారు.

పనస తొనల హల్వా
కావాల్సినవి: పనస తొనలు- పది, బెల్లం తురుము- అర కప్పు, కొబ్బరి తురుము- ముప్పావు కప్పు, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, డ్రైఫ్రూట్స్- గుప్పెడు, యాలకుల పొడి- చెంచా.
తయారీ: పనస తొనలను మిక్సీలో వేసి గుజ్జు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేడి చేసి డ్రైఫ్రూట్స్ను వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే పనస తొనల గుజ్జును వేసి చిన్నమంటపై కాసేపు
వేయించాలి. మరో గిన్నెలో బెల్లం తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి కరిగించాలి. ఈ నీటిని వడకట్టి ఉడికించిన గుజ్జులో పోసి కలపాలి. దీనికి కొబ్బరి తురుము జత చేయాలి. మిశ్రమం దగ్గరగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. చివరగా డ్రైఫ్రూట్స్, యాలకుల పొడి వేస్తే సరి.

#halfacrecultivation

Loading comments...