Egg Replacements | Eggs Substitute | Alternate for Eggs | గుడ్లకు ప్రత్యామ్నాయ ఆహారం |

28 days ago
16

Egg Replacements | Eggs Substitute | Alternate for Eggs | గుడ్లకు ప్రత్యామ్నాయ ఆహారం |

గుడ్డుకి ప్రత్యామ్నాయాలు.

గుడ్డుకి బదులుగా, పోషకాలందించే ప్రత్యామ్నాయాలు.
వెజిటేరియన్ ప్రోటీన్
బఠాణీ. పోషకాలు మెండుగా, అందరికీ అందుబాటులో ఉండే వీటిని చిన్నారులూ, శాకాహారులూ గుడ్డుకి ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. ఇందులో ఉండే ఇనుము ఎర్రరక్త కణాలను వృద్ధి చేయడంలో సాయపడుతుంది. గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ. అంతేకాదు, మెగ్నీషియం, విటమిన్ , సి వంటి పోషకాలు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుతాయి.
స్వీట్ కార్న్. ఇందులోని మెగ్నీషియం ఎముకలను దృఢపరుస్తుంది. పొటాషియం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చి అలసటను దూరం చేస్తుంది. దీంతోపాటు కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. విటమిన్-సి ఎక్కువగా ఉండటంవల్ల వ్యాధినిరోధక శక్తి మెరుగుపడుతుంది.
వేరుశనగ. దీంట్లో ప్రొటీన్ ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. భోజనం తరవాత గ్లూకోజ్ వేగంగా పెరగకుండా చేస్తుంది. మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. అంతేకాదు యాంటీ అక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చడం వల్ల చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బ్రాకలీ.
ఇందులో ప్రొటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. చిన్నారులు గుడ్డును ఇష్టపడకపోతే వీటిని రుచిగా వండి పెట్టండి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. దీనిలోని కెరోటినాయిడ్స్ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. బీటా- కెరోటినాయిడ్లు శరీరంలో విటమిన్-ఎ గా మారి కంటి ఆరోగ్యాన్నీ కాపాడతాయి.

Loading comments...