Rose Apple Benefits | Gulab Jamakaya | Water Apple | రోజ్ యాపిల్ నుండి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.

28 days ago
13

water apple, rose apple, gulab jamakaya, kammari kayalu.
మండు వేసవిలో.. దాహార్తిని తీర్చి పోషకాలు అందించే పళ్లలో రోజ్ యాపిల్ కూడా ఒకటి. వీటినే గులాబ్ జామూన్లు, గులాబీ జామకాయలు , కమ్మరి కాయలు అని కూడా అంటూ ఉంటారు. వీటితో ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి.
పచ్చిగా ఉన్న కాయలు వగరుగా ఉంటాయి. వీటిని పచ్చళ్లు, కూరల తయారీలో ఉపయోగిస్తారు. పండినవైతే రుచిలో తీయగా, కరకరలాడుతూ అద్భుతంగా ఉంటాయి. వీటితో జ్యూసులు, స్మూతీలు తయారుచేసుకోవచ్చు. కెలొరీలు తక్కువగా ఉండి, ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే బరువు తగ్గడానికి ఈ పండు బాగా ఉపయోగపడుతుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్ ఎ, బి, సిలు పుష్కలంగా లభిస్తాయి. గుండె పనితీరు మెరుగు పడుతుంది.

ఈ పండ్లలోని ఫ్లెవనాయిడ్లు క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని మలినాలను తొలగిస్తాయి. సి విటమిన్ తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది. చిన్న చిన్న ఆనారోగ్యాలు, జలుబు, జ్వరాల వంటివి ఎదుర్కొనే శక్తిని అందిస్తాయీ గులాబి జామకాయలు. దీంట్లో ఉండే నియాసిన్ చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయులను పెంచుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఈ పండ్లలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. గర్భిణులకు ఇవి చాలా మేలు చేస్తాయి. వికారం నుంచి ఉపశమనం లభిస్తుంది. మధుమేహం ఉన్నవారూ ఈ పండు తీసుకోవచ్చు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయులు తగ్గుతాయి.

వాటర్ యాపిల్ చూడ్డానికీ ఎంతో అందంగా ఉంటుంది. దీన్ని సులభంగా పెంచుకోవచ్చు. ఈ వాటర్ యాపిల్లో పోషకాలూ ఎక్కువే.

#halfacrecultivation

Loading comments...