Today's News Update టుడే న్యూస్ అప్డేట్ 04-08-2018

OneIndia_TeluguPublished: August 4, 2018
Published: August 4, 2018

A 32-year-old woman allegedly closed the nose of her newborn daughter the baby at a west Delhi hospital on Sunday, the police said. Investigators said the woman told them she did not want a third daughter.The woman, identified by the police as Reeta Devi, reportedly told interrogators she was “out of her senses” when she newborn daughter, the police said.
#Newlybornbaby
#jagan
#EastGodavari
#karunanidhi

1. దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడపిల్ల కనీసం కళ్లు తెరిచి లోకం చూడకముందే ఆ కర్కష తల్లి చిన్నారి బిడ్డ ముక్క మూసి ఊపిరాడకుండ చేసి హత్య చేసింది. వివరాల్లోకెళితే... రీటా దేవీ అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ ఢిల్లీ మోతీనగర్ లోని ఈఎస్ఐ హాస్పిటల్‌లో చేరింది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఎంతో నొప్పులను భరించి జన్మనిచ్చిన అదే తల్లి అదే చేతులతో బిడ్డను చంపేసింది. ఆడపిల్లలు తన భర్తకు ఇష్టం లేదని ఎప్పుడూ తమ మధ్య ఇదే అంశంపై గొడవ జరిగేదని రీతాదేవీ డెలివరీకి ముందు తన సహాయకురాలితే చెప్పేదట. ఇప్పటికే తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని ఆమెతో అనేదట. అందుకే ఈ సారి ఆడపిల్ల వద్దు అని తరుచూ చెప్పేదట. అయితే ఈ చర్యను సైకియాట్రిస్టులు మరోలా చెబుతున్నారు. ప్రసవానంతరం నుంచి వచ్చిన నిరాశతోనే కొందరు తల్లులు ఇలా ప్రవర్తిస్తారని చెబుతున్నారు.
2. రష్యాకు చెందిన హెలికాప్టర్‌ సైబీరియా ఉత్తర ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంఐ-8 హెలికాప్టర్‌ శనివారం ఉదయం ఆయిల్‌ స్టేషన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రష్యా రవాణాశాఖ అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్‌లో 15 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. హెలికాప్టర్‌ టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే మరో హెలికాప్టర్‌ మోసుకొస్తున్న పరికరాలకు తగలడంతో కుప్పకూలిపోయిందని తెలిపారు. మరో హెలికాప్టర్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయినట్లు చెప్పారు

Be the first to suggest a tag

    Comments

    0 comments