ఇంకా ఎంతకాలం ఈ మధ్యతరగతి జీవితాలు ? 💰 దీన్ని అధిగమిద్దాం 💰| middle-class lives? Let's get over it 💰🏠

4 months ago
16

ఇంకా ఎంతకాలం ఈ మధ్యతరగతి జీవితాలు ? 🏠 దీన్ని అధిగమిద్దాం. 💰.
How long will these middle-class lives? 🏠 Let's get over it. 💰.

#halfacrecultivation
#indiapost
#indiapostpaymentsbank

ఇంకా ఎంతకాలం మధ్యతరగతి జీవితాలు, దీన్ని అధిగమిద్దాం. మన పిల్లలకు తిండిపుష్టితో పాటు ఆర్థిక భరోసా కల్పించటం మన బాధ్యత. చిన్న చిన్న దుబారా ఖర్చులు తగ్గించుకుంటే పిల్లలను ఆర్థికంగా నిలబెట్టగలం. ప్రతినెలా మన అనవసర ఖర్చు దాదాపు ₹3000 ఉంటుంది అని అంచనా. దీనిని సురక్షిత పెట్టుబడులు పెడితే మన పిల్లలను లక్షాధికారి చేయడం చాలా సులభం. మీరే మీ పిల్లలకు సూపర్ హీరో అని మర్చిపోకండి. ఇది వారి ఆర్థిక అక్షరాస్యత కూడా ఉపయోగపడుతుంది. మనకు తెలిసిన పోస్టాఫీస్‌లోని పథకాలే ఉపయోగపడతాయి.
ముందుగా పోస్టాఫీస్ లేదా IPBP ఖాతా తెరవండి. ఇప్పుడు
1. ₹400 యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇది సంవత్సరానికి ఒకసారి. ఇది 10,00,000 యాక్సిడెంటల్ బీమా కవరేజీ కల్పిస్తోంది. మనకి ఏదైనా అనుకోనిది జరిగితే కుటుంబాన్ని ఆదుకుంటుంది.
2. ₹1000 తో రికరింగ్ డిపాజిట్ తీసుకోండి. ఐదేళ్ల కి మనకి దాదాపు ₹72,000 వస్తాయి.
మీకు 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఉన్నట్లయితే సుకన్య సమృద్ధి యోజన ఎకౌంట్ ఓపెన్ చేయండి. నెలకు ₹2000 ఇందులో పెట్టుబడి పెట్టండి. 20 సంవత్సరాలకు దాదాపు ₹11,20,000 వస్తాయి.
3. ₹3000 తో రికరింగ్ డిపాజిట్ తీసుకోండి. ఐదేళ్ల కి మనకి దాదాపు ₹2,15,000 వస్తాయి.

 మీకు ఆడ పిల్లలు ఉన్నట్లయితే ఆప్షన్ 2 లేకపోతే ఆప్షన్ 3 లో పెట్టుబడి పెట్టండి.
ఖర్చు పెట్టేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి. మీ చిన్న చిన్న పొదుపు మొత్తాలే, మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది. పూర్తి వివరాలకు మీ దగ్గర్లోని పోస్టాఫీస్ లేదా పోస్ట్ మ్యాన్ ను సంప్రదించగలరని మనవి. మరిన్ని వివరాలు తరువాత వీడియోలో చూద్దాం. అలాగే మీకు తెలిసిన పొదుపు పథకాలు ఉంటే తెలియజేయగలరు.

Loading comments...