Amazing Benefits of Eating Persimmon Fruit | అమరఫలం తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు | పసిమన్|

26 days ago
19

Persimmon fruit health benefits.
How to eat persimmon fruit. Unique and rare Indian fruits.
Japani Phal | Persimmon|
#halfacrecultivation
అమరఫలం : ఫ్రూట్ ఆఫ్ గాడ్స్.
నారింజ రంగు టొమాటో పండులా ఉంటుంది. కానీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత మృదువుగా తియ్యని తేనె రుచితో మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంటుంది. అందుకే దాని రుచి మరే పండుకీ సరితూగదు అంటుంటారు. అదే పసిమన్ అమర్ఫల్, ఆమ్లాక్ ఫలంగా పిలిచే ఈ ఉత్తరాదిపండుని... ఈమధ్య దక్షిణాదినా అమర్ ఫల్ పండిస్తున్నారు..!
జ్యూస్ లూ సలాడ్లూ బేకింగ్ ఉత్పత్తుల్లో ఈ పండు వాడకం ఎక్కువ.
డ్రైఫ్రూట్స్‌ రూపంలోను మార్కెట్లో దొరుకుతుంది.
గ్రీకులు 'ఫ్రూట్ ఆఫ్ గాడ్స్' అనీ అంటారు.
ఆకట్టుకునే రంగులో కనిపించే పసిమన్ని చైనీయులు 'కాకి ఖర్జూరం' అనీ, అనీ అంటారు. చైనా, జపాన్ దాదాపు ప్రతి ఇంటి పెరట్లోనూ ఈ చెట్లు ఉంటాయి. దీని గురించిన జానపద కథలూ ప్రాచుర్యంలో ఉన్నాయక్కడ. పండులోని గింజను నిలువుగా కోసినప్పుడు- దానిలోపల స్పూనును పోలిన బొమ్మ ఉంటే ఆ ఏడాది చలి తీవ్రత ఎక్కువనీ, కత్తిలా ఉంటే సాధారణమనీ, ఫోర్క్ ఉంటే తక్కువనీ విశ్వసిస్తారట. అలాగే పచ్చిగా ఉన్నప్పుడు చేదుగానూ, పండాక మధురమైన తీపితో ఉండే ఈ పండును బౌద్ధంలో పరిణితి లేదా మార్పునకు సంకేతంగా చెబుతారు.

Loading comments...