సోంపు ఉపయోగాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు | Sompu Uses in Telugu | Natural Mouth Freshener|Fennel Seeds

7 months ago
45

సోంపు జీర్ణశక్తిని పెంచడంతోబాటు నోటిదుర్వాసనని అడ్డుకునే అద్భుత ఔషధంగా అందరినోటా గుబాళిస్తోంది. మార్కెట్లో కనిపిస్తోన్న ముఖ్వాస్ లన్నింటిలోనూ సోంపు గింజలే ప్రధానం. అందుకే ముఖ్వాస్ అనగానే అందరికీ సోంపు గుర్తుకొస్తుంది. కాకపోతే సోంపుగింజలకి జోడించే మిశ్రమాలే మారు తుంటాయి. సోంపు గింజలతోబాటు అచ్చంగా సోంపుగింజల్లానే ఉండే అనీస్ గింజలూ, ఎండు కొబ్బరితురుము, నువ్వులూ, అవిసెగింజలూ, మెత్తని వక్కపలుకులూ, దనియాలూ, దోసగింజలూ, సారపప్పులూ, గులాబీ రేకులూ, ఎండు తమలపాకులూ, ఎండు పుదీనా ఆకులు, ఎండు ఉసిరిముక్కలూ, కుంకుమపువ్వు, పంచదార పలుకులూ ఇలా రకరకాల దినుసుల్ని, పెప్పర్మెంట్ నూనెతోబాటు ఇతరత్రా సుగంధద్రవ్యాల నుంచి తీసిన గాఢతైలాలను కలిపి చేసేదే ముఖ్వాస్. సోంపు ముదురు గోధుమ లేదా ఆకుపచ్చ రంగుల్లో ఉండే సోంపు గింజలు నమిలేకొద్దీ సువాసనను వెదజల్లుతుంటాయి.

Loading comments...