The Health Benefits of Black Rice | నల్ల బియ్యం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు | చక్రవర్తుల బియ్యం |

1 year ago
35

#halfacrecultivation
నల్ల బియ్యం ప్రయోజనాలు..
బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్ మాదిరిగానే ఉంటుంది. కొంచెం ఎక్కువ సేపు నమిలి తినాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఫైబర్ మరియు ఇనుము అధికంగా ఉంటాయి. బ్లాక్ రైస్ గ్లూటెన్ రహితం. నల్లబియ్యంలో 18 రకాల అమినో ఆమ్లాలు, రాగి, కెరోటీన్, ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. టైపు-2 మధుమేహం బారిన పడకుండా రక్తంలో చక్కెర స్థాయుల్ని నియంత్రిస్తుంది. ఇందులో ఉండే విటమిన్-ఇ కళ్లు, చర్మం వ్యాధులు రాకుండా, రోగ నిరోధక శక్తి పెంచుతుంది. గుండె జబ్బులు రాకుండా గుండెకు సంబంధించిన రక్త నాళాలు పూడిపోకుండా నివారిస్తుంది. కొవ్వులు, ట్రైగ్లిసరాయిడ్స్ వంటి వాటిని నల్లబియ్యం అన్నం నియంత్రించడం వల్ల వ్యాధులు రాకుండా లివర్ను కాపాడుతుంది. మనిషి శరీరంలో కేన్సర్ గడ్డలు, రొమ్ము కేన్సర్ సెల్స్ పెరగకుండా అడ్డుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

Loading comments...