Flaxseed Health Benefits | అవిసె గింజలు ఆరోగ్య ప్రయోజనాలు.

7 months ago
36

Benefits of flaxseed for women, flax seeds weight loss in Telugu.
పోషకాలతో గని - అవిసె గింజలు ప్రపంచంలోని పురాతన పంటలలో ఒకటి. బ్రౌన్ మరియు గోల్డెన్ అనే రెండు రకాలు ఉన్నాయి, రెండూ సమానంగా పోషకమైనవి. అవిసె గింజలో అనేక ముఖ్యమైన విటమిన్లు మరియు మినరల్స్‌తో పాటు ప్రోటీన్, ఫైబర్ మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మంచి మొత్తంలో ఉంటాయి.

ఉపయొగాలు
• అవిసెగింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువశాతం ఉంటాయి. ప్రతిరోజూ టేబుల్‌స్పూను అవిసెగింజల పొడిని తీసుకోవడం వల్ల సుమారు 1.8 గ్రాముల ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్‌ శరీరానికి అందుతాయి. ఈ గింజల్ని కానీ, నూనెను కానీ తీసుకోవడం వల్ల హృద్రోగాలూ అదుపులో ఉంటాయి.
• అవిసెగింజల్లో పీచు- కరిగే, కరగని రకాల్లో ఉండటం విశేషం. ఈ పీచు పదార్థం జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి, జీర్ణసంబంధ సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. అవిసెగింజల్లోని సాల్యుబుల్‌ ఫైబర్‌ చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించి తద్వారా గుండె జబ్బులతోపాటూ స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, మెటబాలిక్‌ సిండ్రోమ్‌ వంటి సమస్యలు అదుపులో ఉండేలా చేస్తుంది. బరువూ తగ్గుతారు. తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా పొట్ట నిండిన భావన కలుగుతుంది .
• అవిసెగింజల్లో లిగ్నాన్లు 75 నుంచి 800 రెట్లు ఎక్కువగా ఉంటాయట. ఈ లిగ్నాన్లు ఆస్టియోపోరోసిస్‌ను నివారించి మెనోపాజ్‌ లక్షణాలనూ తగ్గిస్తాయని అంటారు. అదేవిధంగా రొమ్ము, ప్రొస్టేట్‌, కొలొన్‌, ఊపిరితిత్తులు.. తదితర క్యాన్సర్‌ కారకాలను నియంత్రించడంలో అవిసెగింజలు కీలకంగా పనిచేస్తాయి.
• అవిసెగింజల్లోని పాలిఫెనాల్స్‌ కణాలకు రక్షణకవచాల్లా పనిచేసి...ఎన్నోరకాల ఆనారోగ్యాలను దరిచేరకుండా కాపాడతాయి. అలాగే వీటిల్లోని థయామిన్‌ మనం తీసుకునే ఇతర పోషకాలను శక్తిగా మార్చేందుకు తోడ్పడితే మెగ్నీషియం నాడీవ్యవస్థకూ, కండరాల వృద్ధికీ, రోగనిరోధకశక్తికీ ఉపయోగపడుతుంది. వీటిలో అధికంగా ఉండే ఐరన్ తో ఎర్రరక్తకణాలూ వృద్ధి చెందుతాయి.
అందానికీ మేలుచేస్తాయి..
ఈ మధ్య జుట్టు బలంగా పెరగడానికి చిట్కాలు అంటూ కొన్ని తెగ కనిపిస్తున్నాయి. వాటిల్లో జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరిగేందుకు ఎక్కువమంది అవిసెగింజలతో చేసిన జెల్‌ను వాడటం చూస్తూనే ఉన్నాం. ఒకటిరెండు చెంచాల అవిసెగింజల్ని ఉడికించి జెల్‌లా తయారుచేసి కాస్త కొబ్బరినూనె, కలబంద గుజ్జు వంటివి కలిపి తలకు పట్టించి కాసేపయ్యాక కడిగేయడం అన్నమాట. ఇలా చేయడం వల్ల ఈ గింజల్లో ఉండే విటమిన్‌ - ఇ, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు జుట్టు కుదుళ్లను దృఢంగా మార్చి, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఈ జెల్‌ రెడీమేడ్‌గానూ దొరుకుతోంది. ఈ గింజల్లో ఉండే ఆల్ఫా-లినోలెనిక్‌ యాసిడ్లు మొటిమల్నీ, మచ్చల్నీ నివారిస్తాయి. వీటిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు చర్మాన్ని తేమగా, తాజాగా మరియు లిగ్నాన్లూ యాంటీఆక్సిడెంట్లూ చర్మం ముడతలు పడకుండా చేస్తాయి. విటమిన్‌ - ఇ వల్ల చర్మంలో కొలాజిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది.
ఎలా తీసుకోవచ్చంటే..
అవిసెగింజల్ని నేరుగానే వాడుకోవచ్చు లేదా పొడి తీసుకోవచ్చు. ఆ గింజల్ని దోరగా వేయించుకుని ఆ తరువాత పొడి చేసుకుని భద్రపరుచుకుంటే... పాలు, మిల్క్‌షేక్‌, స్మూతీ, జావ, చపాతీలు, బ్రెడ్‌, కూరలు, సూప్‌లు.. ఇలా ఎందులోనైనా ఒకటి రెండు చెంచాలు వేసుకోవచ్చు. పొడి రూపంలో తీసుకుంటుంటే గనుక మంచినీటిని ఎక్కువగా తాగడం అవసరం. లేదంటే కడుపు ఉబ్బరం, గ్యాస్‌, డయేరియా వంటి సమస్యలు ఎదురుకావొచ్చు.

#flaxseed #అవిసెగింజలు

Loading comments...