అరిటాకులు విస్తరాకుల్లో భోజనానికి అంత ప్రత్యేకత ఎందుకో తెలుసా?

6 months ago
44

అరిటాకులు, విస్తరాకులు మరియు ఇతర ఆకుల్లో భోజనానికి అంత ప్రత్యేకత ఎందుకో తెలుసా?
Do you know why leaves are so special for eating?
Leaves are so special for eating.

సహజసిద్ధమైన ఆకుల్లో భోజనం చేయడం వల్ల మన శరీరానికి ఆహారంలోని పోషకాలు వెంటనే అందుతాయి. అరిటాకు, విస్తరాకు, ఇతర ఆకుల్లో భోజనం చేయడం ద్వారా వీటిలో ఉండే ఔషధతత్వాలు మన శరీరానికి అందుతాయి. వీటిని తిన్న తర్వాత చెత్తలో పారేస్తే మట్టిలో కలిసిపోతాయి. ఎలాంటి కాలుష్యం ఉండదు. ఇవి ప్రకృతి మనకిచ్చిన అద్భుత వరాలు. వీలైనంతవరకు ప్లాస్టిక్ దూరంగా ఉండండి.

అరిటాకు
శుభ సూచకం. ఇది పెద్దగా ఉండి త్వరగా ఎండిపోదు. దీనిమీద వడ్డించిన వేడివేడి పదార్థాలు చక్కని సువాసనలు వస్తుంటాయి. ఆహారంలోని రుచిని అలాగే ఉంచడంతోబాటు, పదార్థాల్లోని నీరు, నూనెలను పీల్చుకోదు. అందుకే వేడివేడి పదార్థాలనూ దీంట్లో వేసుకుని తినగలుగుతారు. ఇవి సులభంగా దొరుకుతాయి. అందుకే ఇప్పటికీ దక్షిణాది ప్రాంతాల్లో వీటిలోనే ఎక్కువగా భోజనం చేస్తుంటారు.

బాదం ఆకులు
బాదం ఆకులను పచ్చిగా ఉన్నప్పుడు వాడితే మంచిది. వీటిని ఆహార పదార్థాలను ఉడికించడానికి, భోజనం చేయడానికి వాడుతుంటారు. బాదం ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నట్లు ఒక పరిశోధనలో తేలింది.

పనస ఆకు
అల్పాహారం వడ్డించడానికి పనస ఆకు అనువుగా ఉంటుంది. దీన్ని కుడుముల తయారీకి, కొన్ని ఆవిరి వంటలకు వాడుతుంటారు. ముఖ్యంగా వండిన పదార్థాలు దీనికి అంటుకోకుండా ఉంటాయి. దీనిలో ఔషధతత్వాలు ఆహారానికి అందడం ద్వారా రుచి మెరుగవుతుంది.

మోదుగ ఆకులు / విస్తరాకులు
మోదుగ ఆకులను విస్తరిగా కుట్టి ఉపయోగిస్తారు. ఈ విస్తర్లు కొన్ని నెలలపాటు పాడవకుండా ఉంటాయి. వీటిని దొన్నెలు, పళ్లాలుగా చేసి వాడుతుంటారు. మోదుగతో చేసిన విస్తళ్లలో భోజనం చేయడం ద్వారా ఆహారం రంగు, రుచి, వాసన తగ్గకుండా ఉంటుంది. ఆకుల్లోని ఔషధ గుణాలు ఆహారానికి కొంత అందుతాయి. ఈ ఆకుల్లోని ఔషధతత్వాలు వాత, కఫాలను తగ్గిస్తాయి. శరీరంలో వేడిని, చర్మ రోగాలను తగ్గిస్తాయి.

తామరాకులు
నెయ్యి, నూనెలు వాడి వంటకాలు తయారుచేసేటప్పుడు వేడికి ఇవి ఇగిరిపోకుండా ఉండటానికి తామరాకును ఉపయోగిస్తారు.

By eating natural leaves, our body gets the nutrients from the food immediately. By eating aritaku, vistaraku and other leaves, the medicinal properties of these are available to our body. If you throw them in the garbage after eating them, they get mixed up in the soil. There is no pollution. These are the wonderful gifts of nature. Avoid plastic as much as possible.

Banana leaves
A good sign. It is bulky and does not dry quickly. The hot ingredients served on this give nice aromas. It does not absorb the water and oils in the ingredients while retaining the taste of the food. That's why you can put hot food in it and eat it. These are easily available. That's why they still eat more of these in the southern regions.

Almond leaves
Almond leaves are best used when they are raw. They are used to cook and eat food. A research has shown that almond leaves have antibacterial properties.

Panasa leaf
Panasa leaf is suitable for serving breakfast. It is used for making dumplings and some steam dishes. Especially cooked ingredients will not stick to it. In this the flavor is enhanced by the addition of medicinal substances to the food.

Moduga leaves / broadleaf
Moduga leaves are widely used. These spreads remain intact for several months. These are made into wheels and plates and used. By eating in beds made of straw, the color, taste and smell of the food will not be lost. Some of the medicinal properties of the leaves are available in food. The medicinal properties of these leaves reduce vata and kapha. Reduces body heat and skin diseases.

Lotus leaves
While preparing ghee and oil based dishes, tamaraku is used to prevent them from burning in the heat.

Loading comments...