డ్రై ఫ్రూట్స్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు. | Health Benefits of Dry Fruits |

1 year ago
22

డ్రై ఫ్రూట్స్.. .. అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేవి కిస్మిస్ లేదా ఎండు ఖర్జూరం. కానీ ఆపిల్, ఆప్రికాట్, అరటి, చెర్రీ, అంజీర్ (అత్తిపండు), బొప్పాయి, పైనాపిల్, ఇలా పండ్లన్నీ ఎండు పండ్ల రూపంలోనూ దొరుకుతున్నాయి. చెట్టు నుంచి రాలిన ఎండుపండ్లు తియ్యగా ఉండటంతోబాటు ఎంతకాలమైనా, పాడవకుండా ఉండటాన్ని మొదటగా మెసపొటేమియన్లు గుర్తించి వాటిని ఎండబెట్టడం ప్రారంభించారట.
ఎండుపండ్ల వినియోగంలో ఇప్పటికీ ప్రథమస్థానం కిస్మిస్. తరవాత స్థానంలో ఖర్జూరాలూ, అత్తిపండ్లూ, అప్రికాట్లూ పీచ్, ప్లమ్ పండ్లూ, ఆపిల్సూ, పియర్సూ ఉన్నాయి. ఇటీవల చెర్రీ, స్ట్రాబెర్రీ, పైనాపిల్, బ్లూబెర్రీ, మామిడిపండు ఇలా అన్నింటినీ ఎండబెడుతున్నారు.

Loading comments...