Premium Only Content

కరివేపాకు ఆరోగ్య ప్రయోజనాలు curry leaves benefits #ఆరోగ్య ప్రయోజనాలు #curry #leaves #benefits
కరివేపాకు ఆరోగ్య ప్రయోజనాలు curry leaves benefits #ఆరోగ్య ప్రయోజనాలు #curry #leaves #benefits
Table of Contents
Introduction:
Nutritional Value of Curry Leaves:
Properties of Curry Leaves:
Potential Uses of Curry Leaves:
How to Use Curry Leaves?
Side Effects of Curry Leaves (Kadi Patta):
Precautions to Take With Curry Leaves:
Interactions With Other Drugs
Frequently Asked Questions:
References:
This might
be related & helpful!
Powerful antioxidant. ...
May reduce the risk of cancer. ...
Reduces risk of heart diseases. ...
Helps in the management of diabetes. ...
Help deal with stomach ailments. ...
Effective against morning sickness. ...
Analgesic. ...
Neuroprotective effects.
కరివేపాకును పక్కన పెట్టేస్తున్నారా? ఈ ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే.. తప్పకుండా నమిలి మింగేస్తారు.
ప్రతి భారతీయ వంటకాల్లో కరివేపు కామన్‌గా కనిపిస్తుంది. చాలామంది దీన్ని కేవలం రుచి కోసమే వేస్తారని అనుకుంటారు. పక్కకు తీసి పడేస్తుంటారు. అయితే, కరివేపాకు వల్ల కలిగే ఈ ప్రయోజనాలు గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు. కరివేపాకు తాజా సువాసన, కమ్మని రుచిని అందిస్తుంది. అందుకే, మన ఇళ్లల్లో కరివేపాకు లేనిదే వంట పూర్తికాదు.
మన పూర్వికులు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం ఈ కరివేపాకే. ఫాస్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కరివేపాకును పట్టించుకొనేవాళ్లు తక్కువైపోయారు. మరి, కరివేపాకు ప్రత్యేకతలు, అందులోని ఔషదగుణాలు ఏమిటో తెలుసుకుందామా!
కరివేపాకు శాస్త్రీయ నామం ముర్రయ కియిని. ఇది రుటేషియ కుటుంబానికి చెందినది. కరివేపాకు ఎక్కువగా ఇండియాలోనే పండుతుంది. చైనా, ఆస్ట్రేలియా, సిలోన్, నైజీరియాల్లో కూడా కరివేపాకు మొక్కలను పెంచుతారు. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, వివిధ రకాల ఔషధ గుణాల ఉన్నాయి. అందువల్ల కరివేపాకును కేవలం వంటల్లోనే కాకుండా.. వివిధ ఔషదాల్లోని ఉపయోగిస్తారు. కరివేపాకులో యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, హిపటో ప్రొటెక్టివ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన కాలేయానికి రక్షణ కల్పిస్తాయి.
కరివేపాకు వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ.
జుట్టు సమస్యలను నివారించేందకు కరివేపాకు ఉపయోగపడుతుంది.
జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. అజీర్తి, ఎక్సెసివ్ యాసిడ్స్ ఉత్పత్తిని నివారిస్తుంది.
కరివేపాకు చర్మం సంరక్షణకు సహాయపడుతుంది. ఆకులు రసం లేదా పేస్ట్ కాలిన, తెగిన గాయాలు, చర్మం దురదలు తగ్గించడానికి ఉపయోపడతాయి.
శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్‌ను కరిగించి బరువు తగ్గిస్తుంది.
ఆమ్లశ్రావం, జీర్ణ పూతలు, ఎముకల అరుగుదలకు, డయాబెటిస్, అతిసారం, గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యలను నియంత్రిస్తుంది.
కరివేపాకు వేర్లను శరీర నొప్పులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు.
కరివేపాకు హైపర్గ్లైసీమిక్ డయాబెటిక్ రోగుల రక్త గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తాయి.
లుకేమియా, ప్రొస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ల నివారణకు కరివేపాకు మంచి ఔషదం అని తేలింది.
కరివేపాకు జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది.
కరివేపాకులో ఉండే విటమిన్-A కంటి చూపును మెరుగుపరుస్తుంది.
పాము కాటు ఉపశమనం కోసం కరివేపాకు బెరడును వాడతారు.
కరివేపాకులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, మెగ్నీషియం, రాగి ఉంటాయి.
నికోటినిక్ ఆమ్లంతోపాటు విటమిన్ C, విటమిన్ A, విటమిన్ B, విటమిన్ E, యాంటీఆక్సిడెంట్స్, ప్లాస్టీ స్టెరాల్స్, అమైనో ఆమ్లాలు, గ్లైకోసైడ్లు, ఫ్లేవానాయిడ్స్ ఉంటాయి.
కరివెపాకులో ఉన్న కార్బజోల్ ఆల్కలోయిడ్లలో అతిసారాన్ని నివారించవచ్చు.
ఆయుర్వేదంలో జీర్ణశయ సమస్యలకు కరివేపాకును ఉపయోగిస్తారు.
కరివేపాకులోని యాంటిఅక్సిడేంట్లు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.
కరివేపాకులోని టానిన్లు, కార్బాజోల్ ఆల్కలాయిడ్లు హెపటైటిస్, సిర్రోసిస్ వంటి వ్యాధుల నుంచి కాలేయాన్ని కాపాడతాయి.
కరివేపాకు చర్మం సంరక్షణకు సహాయపడుతుంది. ఆకులు రసం లేదా పేస్ట్ కాలిన, తెగిన గాయాలు, చర్మం దురదలు తగ్గించడానికి ఉపయోపడతాయి.
పిల్లల్లో ఆకలి మందగిస్తే అన్నంలో కాస్త కరివేపాకు పొడి, నెయ్యి వేసి తినిపిస్తే ఆకలి పెరుగుతుంది.
కరివేపాకు యూరిన్ సమస్యలను తగ్గిస్తుంది.
కరివేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ యూరిన్, బ్లాడర్ సమస్యలను నివారిస్తుంది.
కరివేపాకులు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. దీన్ని చర్మానికి రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది
కరివేపాకు తినడం వల్ల అనీమియా తగ్గుతుంది
కరివేపాకులో ఉండే ఐరన్.. రక్తహీనత సమస్యలతో బాధపడేవారికి మేలు చేస్తుంది
కరివేపాకు డయేరియాను నివారిస్తుంది
కరివేపాకు తినేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది
కరివేపాకు తింటే శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి
రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే పదార్థాలు కరివేపాకులో అధికంగా ఉండి.. మధుమేహం రోగులకు మేలు చేస్తుంది
కరివేపాకులోని కొయినిజన్ వంటి రసాయనాలు మధుమేహ రోగులకు వరం
కిడ్నీ ప్రక్షాళనకు కరివేపాకు మేలు చేస్తుంది
రోజుకు రెండు సార్లు కరివేపాకు రసాన్ని తాగితే మూత్రపిండ సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు
కరివేపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. కానీ మనం కరివేపాకును తేలిగ్గా తీసుకుంటాం. కంచంలో కనిపిస్తే కరివేపాకును తీసిపడేస్తాం. డయాబెటిస్, హైపర్‌టెన్షన్ తదితర జీవన శైలి వ్యాధులే కాకుండా అనేక వ్యాధులకు నివారణిగా ఉపయోగపడుతుంది
సమతుల ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారు రోజుకు 10 చొప్పున కరివేపాకు ఆకులను తినాలి. ఇలా 3 నెలల పాటు తింటే అసలు మధుమేహం (డయాబెటిస్) దరిచేరదని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు
కరివేపాకును పొడి చేసి మెంతులు, ఉసిరి, నేరేడు గింజల పొడి, నల్ల జీలకర్ర, తిప్పసత్తు, నాటు కాకర కలిపి పొడి చేసుకోవాలి. భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దలో ఒక రెండు చెంచాలు కలుపుకొని తినాలి. ఇలా చేస్తే డయాబెటిస్ ఉన్న వారికి షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
వీరు కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారం ఇది.
కరివేపాకు పండ్లు, లేదా బెరడు కషాయంగా కాచుకోవాలి. దీనిని రోజూ కొద్దిగా తాగితే హైపర్ టెన్షన్ (బీపీ) వల్ల వచ్చే సైడ్‌ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి.
అర్శమొలలు (పైల్స్) తగ్గాలంటే లేతగా ఉన్న కరివేపాకును జ్యూస్‌గా చేసుకుని తేనె కలిపి తాగితే సరిపోతుంది. పైల్స్ ఉన్న వారికి ఉపశమనం లభిస్తుంది.
వికారం తగ్గడానికి కూడా కరివేపాకు ఉపయోగపడుతుంది. కరివేపాకు రసం చేసుకుని దానికి అంతేమొత్తంలో నిమ్మరసం కలుపుకుని రోజూ ఓ రెండుసార్లు తాగితే వికారం, వాంతుల నుంచి రిలీఫ్ ఉంటుంది.
మలబద్దకం, కడుపులో మంట, కడుపు ఉబ్బరం తదితర జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఉంటే కరివేపాకు చూర్ణంలా చేసుకొని మజ్జిగలో కలిపి తాగాలి,
జ్వరం ఉన్నప్పుడు కాస్త కరివేపాకు కషాయం కాచుకుని తాగితే జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది,
జీర్ణ శక్తి పెరగాలంటే కరివేపాకులను ఎండబెట్టి ధనియాలు, జీలకర్రతో కలిపి వేయించాలి, నేతితో వేయించి చూర్ణం చేసుకుని కాస్త సైంధవ లవణం కలిపి నిల్వ చేసుకోవాలి, ఆహారంతో పాటు అప్పుడప్పుడు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది, లేదా ధనియాలు, మెంతులు, ఆవాలు సమపాళ్లలో నెయ్యిల వేయించాలి
ఈ మిశ్రమాన్ని దంచి పొడిలా చేసుకోవాలి. ఎండు మిరపకాయలకు బదులుగా శొంఠి పొడి వాడుకుంటే ఇంకా శ్రేష్టం. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అమీబియాసిస్ నుంచి ఉపశమనం కోసం కరివేపాకు పొడి, తేనె కలిపి తీసుకోవాలి.
శ్వాసకోశ వ్యాధుల నుంచి కూడా కరివేపాకు ఉపశమనం ఇస్తుంది. రాత్రి భోజనంలో కరివేపాకు చూర్ణం కలిపి తీసుకున్నా లేదా విడిగా తీసుకున్నా దగ్గు, జలుబు, ఉబ్బసం వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
చలికాలంలో శరీరంలో వేడి పుట్టేందుకు కరివేపాకును ఎక్కువగా మీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
-
LIVE
Grant Stinchfield
57 minutes agoGas Prices Broke Him – Newsom Quits the Fight!
144 watching -
LIVE
Trumpet Daily
34 minutes agoTrumpet Daily LIVE | Sept. 4, 2025
404 watching -
1:01:50
VINCE
3 hours agoEpstein Victims Have Come Forth, The Names Have Not | Episode 118 - 09/04/25
140K85 -
2:03:44
Badlands Media
7 hours agoBadlands Daily: September 4, 2025
35.1K3 -
1:40:33
Dear America
3 hours agoEpstein Victims Vow To EXPOSE Everyone! + Are China and Russia Planning Against Trump?!
106K51 -
LIVE
Law&Crime
3 hours ago $2.12 earnedLIVE: Adelson Matriarch Murder Trial — FL v. Donna Adelson — Day 9
271 watching -
The Big Mig™
2 hours agoCartels Are On Borrowed Time, Here Comes The BOOM!
7.47K14 -
Matt Kohrs
13 hours agoMASSIVE Market Swings Incoming! || Top Futures & Options Trading Show
31.3K2 -
2:59:29
Wendy Bell Radio
7 hours agoIt's All About the Benjamins
55.6K192 -
LIVE
JuicyJohns
3 hours ago $3.22 earned🟢#1 REBIRTH PLAYER 10.2+ KD🟢
68 watching