గుండె ఆరోగ్యంగా ఉండాలంటే #heart #healthy #foods #tips #diet #healthtips #yogi #remedies

5 months ago
3

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే #heart #healthy #foods #tips #diet #healthtips #yogi #remedies

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ పోషకాలు కచ్చితంగా కావాలి..

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ పోషకాలు కచ్చితంగా కావాలి..!
​మన శరీరంలోని ముఖ్యమైన భాగం గుండె. చాలా సున్నితమైన ఈ అవయవాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. సరైన వ్యాయామం, విశ్రాంతితోపాటు, మీ డైట్‌లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే..
గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. గుండె పనితీరును ప్రభావితం చేసే, గుండె ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఏమిటో, ఈ స్టోరీలో చూద్దాం.

మెగ్నీషియం..
గుండె పనితీరును ఆరోగ్యంగా ఉంచడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది.
మెడ్నీషియం శరీరంలో మంట, డిప్రెషన్‌ వంటి ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.
మెగ్నీషియం హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడుతుంది.
గుండె జబ్బులకు ముఖ్యమైన ప్రమాద కారకాల్లో హైపర్‌టెన్షన్‌ కూడా ఒకటి.
మెగ్నీషియం లోపం కారమంగా బీపీ పెరిగే అవకాశం ఉంది.

మీరు హైపర్‌టెన్షన్‌నను కంట్రోల్‌లో ఉంచుకోవడానికి,
గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. మీ డైట్‌లో మెగ్నిషయం అధికంగా ఉండే..
కాలే, బచ్చలికూర, కొల్లార్డ్ గ్రీన్స్, సాల్మన్, అవకాడో, అరటిపండ్లు, నట్స్‌, విత్తనాలు, బాదంపప్పు, జీడిపప్పు, ఆకుకూరలు, పాలు, డార్క్‌ చాక్లెట్‌, చిక్కుడు, బీన్స్‌, సోయా, అవకాడో పండ్లు, పప్పు దినుసులు, కాయధాన్యాలు మీ ఆహారంలో చేర్చుకోండి.

గుండెకు మేలు చేసే ఆహార పదార్థాలు
పొటాషియం..
పొటాషియం..
గుండె సక్రమంగా పని చేయడానికి పొటాషియం సహకరిస్తుంది. రక్తంలోని పొటాషియం గుండె వేగాన్ని క్రమబద్ధీకరిస్తుంది. హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. పొటాషియం కండరాలు, గుండె సంకోచాలను కూడా నియంత్రిస్తుంది. పొటాషియం లోపం కారణంగా.. గుండె లయ క్రమతప్పడం, కండరాల బలహీన వంటి సమస్యలు ఎదురవుతాయి. మీ గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి.. మీ డైట్‌లో బంగాళదుంపలు, కిడ్నీ బీన్స్, అరటిపండ్లు, అవోకాడో, ఎండలో ఎండబెట్టిన టమోటాలు, పాలు, తీసుకోండి.​

విటమిన్‌ డి..
విటమిన్‌ డి..
విటమిన్‌ డి గుండె ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. బీపీ స్థాయిలను నియంత్రించడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి రక్తనాళాల విస్తరణను ప్రోత్సహించి, ఎండోథెలియల్ డిస్‌ఫంక్షన్‌ను తగ్గించి వాస్కులర్ పనితీరును మెరుగుపరుస్తుందని ఓ పరిశోధనలో కనుగొన్నారు. విటమిన్ డి లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది హృదయనాళ వ్యవస్థలో వాపును తగ్గిస్తుంది. విటమిన్ డి లో యాంటిథ్రాంబోటిక్ లక్షణాలు ఉంటాయి. అంటే ఇది రక్తం గడ్డకట్టడం లేదా థ్రాంబోసిస్ ఏర్పడకుండా నిరోధిస్తుంది.

కాల్షియం..
కాల్షియం..
హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంచడానికి.. కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. లో కాల్షియం లెవల్స్‌.. రక్తపోటును పెంచుతాయి. ఇది గుండె సమస్యలు, స్ట్రోక్‌ ముప్పు పెంచుతుంది. మీ గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి.. మీ ఆహారంలో పెరుగు, పాలు, తృణధాన్యాలు, సోయాబీన్స్‌ తీసుకోండి.

B విటమిన్స్‌..
B విటమిన్స్‌..
పోలేట్‌, విటమిన్ B-6 ఎక్కువగా తీసుకునే వ్యక్తులు స్ట్రోక్, గుండె వైఫల్యం, గుండె సంబంధిత మరణాల.. ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. B12, B9, B6 గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. B విటమిన్లు.. శరీరంలో కొత్త ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. ఈ పోషకాలు.. కణజాలాలు, అవయవాలకు ఆక్సిజన్‌ సరఫరాను మెరుగుపరుస్తాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Loading comments...