Premium Only Content

థైరాయిడ్ thyroid #thyroid #problem #women #symptoms #gland #diet #weightloss #exercise #test #report
థైరాయిడ్ thyroid #thyroid #problem #women #symptoms #gland #diet #weightloss #exercise #test #report
థైరాయిడ్ సమస్య ఎందుకు వస్తుంది? మందులు వాడుతున్నా తగ్గకపోతే ఏం చేయాలి?
థైరాయిడ్ ఒక దీర్ఘ కాలిక సమస్య. భారత దేశంలో ప్రతి పది మందిలో ఒకరి కన్నా ఎక్కువ మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
ఈ సమస్య మగవారిలో కన్నా, ఆడవారిలో రెట్టింపు కనిపిస్తుంది.
గొంతు ముందు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ప్రభావం శరీరంలోని దాదాపు ప్రతి అవయవం మీదా ఉంటుంది.
ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గితే థైరాయిడ్ అని, అధికంగా అయితే హైపర్ థైరాయిడ్ అని అంటారు.హైపో థైరాయిడ్ సమస్య హైపర్ థైరాయిడ్ కన్నా అధికంగా ఉంది.
ముందుగా థైరాయిడ్ లక్షణాల గురించి తెలుసుకుందాం. ఆ తరవాత మందులు వాడుతున్నా,
థైరాయిడ్ సాధారణానికి రాకపోవడనికి గల కారణాలు తెలుసుకుందాం.
హైపో థైరాయిడ్ లక్షణాలు: నీరసం, మలబద్ధకం, చర్మం, వెంట్రుకలు పొడిబారడం, ఎక్కువ నిద్ర,
బరువు పెరగడం,
నెలసరిలో రక్తస్రావం ఎక్కువగా లేక తక్కువగా అవ్వడం, గర్భస్రావం, చలిని తట్టుకోలేక పోవడం,
గుండె తక్కువ సార్లు కొట్టుకోవడం, జుట్టు రాలడం, థైరాయిడ్ గ్రంథి వాపు (goitre) తదితర లక్షణాలు ఉంటాయి.
థైరాయిడ్ లక్షణాలు: ఆకలి ఎక్కువ అవ్వడం, బరువు తగ్గడం, చెమటలు ఎక్కువ పట్టడం,
చిరాకు, స్థిమితం లేకపోవడం, నిద్ర లేమి, నీరసం, ఎక్కువసార్లు విరేచనం అవ్వడం,
నెలసరిలో రక్తస్రావం తక్కువగా అవ్వడం, వేడిని తట్టుకోలేక పోవడం, గొంతు ముందు వాపు, గుండె దడ అనిపించడం,
కళ్ళు పెద్దవిగా అవ్వడం, చేతులు వణకడం వంటివి కనిపిస్తుంటాయి.
పిల్లల్లో తెలివితేటలపై ప్రభావం,
గర్భిణుల్లో ఈ సమస్యను ముందుగా గుర్తించకపోతే, పుట్టే పిల్లల్లో మేధాపరమైన లోపాలు ఉండవచ్చు.
చిన్న తనంలోనే ఈ సమస్య గుర్తించడం మంచిది. లేదంటే, పిల్లల ఎదుగుదల శారీరకంగానే కాదు,
మానసికంగానూ మందగించే ప్రమాదం ఉంది,
కాబట్టి థైరాయిడ్ సమస్యను ఆలస్యం చేయకుండా గుర్తించి,
దానికి సరైన చికిత్స పొందడం చాలా ముఖ్యం.
థైరాయిడ్ రక్త పరీక్ష రిపోర్ట్ ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది,
ఉదాహరణకు, గత నెలలో కొన్ని రోజులు మందులు వేసుకోకపోయినా,
ఈ మధ్య కాలంలో ఏమైనా ఇన్ఫెక్షన్ లేక జ్వరం వచ్చినా,
ల్యాబ్ నమ్మకమయినది కాకపోయినా, ఆ రిపోర్ట్‌తో ఎలాంటి నిర్ధారణకు రాలేము.
కాబట్టి కేవలం పేపర్ మీద ఉన్న నంబర్లను చూసి చికిత్స సూచించడం సరి కాదు. రోగిని వైద్యులు పరిశీలించి,
వారిలో లక్షణాలను బట్టి మాత్రమే సరైన చికిత్స అందించగలరు.
థైరాయిడ్ ఈ టిప్స్ ఫాలో అయితే, థైరాయిడ్ కంట్రోల్‌లో ఉంటుంది,
శీతాకాలం థైరాయిడ్ లక్షణాలు తీవ్రమవుతాయి. ఈ సీజన్‌లో థైరాయిడ్ పేషెంట్స్..
ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకోవాలసి ఉంటుంది. చలికాలం ఈ టిప్స్ ఫాలో అయితే థైరాయిడ్ కంట్రోల్ ఉంటుంది,
చాలా మందికి బరువు పెరగడం, అలసట, సాధారణం కంటే చలిగా అనిపించడం, నిరాశ, మలబద్ధకం ,
చర్మం, జుట్టు సంబంధిత సమస్యలు వంటి హైపోథైరాయిడిజం లక్షణాలు కనిపిస్తుంటాయి.
సాధారణ వ్యక్తులలోనూ ఈ సమస్యలు ఎదురవుతుంది
ఇక థైరాయిడ్ పేషెంట్స్‌లో లక్షణాలు మరింత తీవ్రమవుతాయని నిపుణులు అంటున్నారు.
శీతాకాలం ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి.. దీని కారణంగా థైరాయిడ్ పనితీరు మందగిస్తుంది.
థైరాయిడ్ పేపెంట్స్ ఈ సీజన్‌లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
రోజూ మెడిసిన్ వాడటం, లైఫ్‌స్టైల్ మార్పులు చేసుకోవడమే కాదు..
కొన్ని హోమ్‌రెమిడీస్ ఫాలో అవ్వాలని నిపుణులు అంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
కొబ్బరి నూనెలో..
చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రోత్సహిస్తాయి.
ఉదయం ఖాళీ కడుపుతో ఒక స్పూన్ కొబ్బరినూనె తీసుకుంటే.. థైరాయిడ్ పనితీరు మెరుగుపడుతుంది.
రోజూ కొబ్బరి నూనె తాగితే.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది,
జీవక్రియను మెరుగుపరుస్తుంది, శరీరం ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది.
థైరాయిడ్ పేషెంట్స్ వారి ఆహారంలోనూ కొబ్బరి నూనె తీసుకుంటే మంచిది.
అల్లం..
భారతీయ వంటకాల్లో అల్లం ఎక్కువగా వాడుతుంటాం. అల్లం మీ థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది.
అల్లంలో పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.
ఇవి శరీరంలో వాపు, మంటను తగ్గిస్తాయి. థైరాయిడ్ సమస్యలకు ప్రధాన కారణాలలో ఇన్ఫ్లమేషన్ ఒకటి.
రోజూ ఉదయం అల్లం టీ తాగండి.
కొంతసేపు ఎండలో ఉండండి..
రోజూ ఉదయం, సాయంత్రం పూట.. 10 నిమిషాల చప్పున ఎండలో ఉండండి.
విటమిన్ డి పొందడానికి ఇది సులభమైన మార్గం. థైరాయిడ్ పేషెంట్స్‌కు విటమిన్ డి చాలా అవసరం.
అధ్యయనాల ప్రకారం.. సూర్యరశ్మి మెదడు కెమిస్ట్రీ, ఎండోక్రైన్ వ్యవస్థ రెండింటిపై ప్రభావం చూపే హార్మోన్లను ప్రభావితం చేస్తుంది.
అలసట, నిరాశను దూరం చేస్తుంది.
ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి..
ఐరన్ థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడానికి తోడ్పడుతుంది.
మీ ఆహారంలో పప్పుధాన్యాలు, చిక్కుళ్లు, నువ్వులు, పుదీనా, మెంతులు, ఆకు కూరలు తీసుకోండి.
మీ థైరాయిడ్‌ను సమతుల్యం చేయడానికి పుచ్చకాయ, పైనాపిల్ వంటి పండ్లు కూడా తీసుకోండి.
ఆపిల్ సైడర్ వెనిగర్..
యాపిల్ సైడర్ వెనిగర్ హార్మోన్ల సమతుల్య ఉత్పత్తి, వ్యక్తీకరణలో సహాయపడుతుంది.
ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది, శరీర వాతావరణాన్ని ఆల్కలైజ్ చేయడానికి సహాయపడుతుంది.
వెనిగర్ శరీర కొవ్వులను నియంత్రిస్తుంది, శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది.
శరీరం పోషకాలను సమర్థవంతంగా గ్రహించుకునేలా చేస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌ను గోరువెచ్చని నీళ్లలో వేసుకుని తీసుకోండి.
పాల ఉత్పత్తులు..
థైరాయిడ్ పేషెంట్స్ పాల ఉత్పత్తులు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
పాలు, పాల ఉత్పత్తులలో అయోడిన్ అధికంగా ఉంటుంది..
ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రోత్సహిస్తుంది. మీ డైట్‌లో పాలు, జున్ను, పెరుగు తీసుకోండి.
నిర్లక్ష్యం చేయకూడదు...
థైరాయిడ్ రిపోర్టులో కనిపించే T3, T4 స్థాయిలు అనేవి మన శరీరంలోని అవయవాల జీవక్రియలకు సంబంధించినవి. అయితే,
T3, T4 తయారీకి TSH ( థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్) అనేది అవసరం,
ఎప్పుడైతే శరీరంలో T3, T4 తగ్గుతాయో, అప్పుడు వీటి ఉత్పత్తిని పెంచడానికి TSH ఎక్కువగా విడుదల అవుతుంది.
అందుకే హైపో థైరాయిడ్‌లో, T3, T4 తక్కువగా, TSH ఎక్కువగా ఉంటుంది. హైపర్ థైరాయిడ్‌లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుంది.
థైరాయిడ్ గ్రంథిలో వాపు ఉన్నప్పుడు, సంబంధిత రక్త పరీక్ష సాధారణంగా ఉన్నంత మాత్రాన ఎలాంటి సమస్య లేదు అని అనుకోవడానికి లేదు.
రక్త పరీక్ష బాగుండి, గొంతు ముందు భాగంలో గడ్డ లాగా, లేక వాపు లాగా ఉంటే, నిర్లక్ష్యం చేయకూడదు.
అది కొన్నిసార్లు థైరాయిడ్ క్యాన్సర్ లక్షణం అయివుండవచ్చు. కాబట్టి, వెంటనే గొంతు స్కాన్ చేయించడం,
అవసరమైతే ఆ వాపు నుండి సూది ద్వారా ముక్క తీసి, ఎఫ్, ఎన్, ఏ, సి, పరీక్ష చేయడం మంచిది.
సమస్యను సరిగ్గా గుర్తించి, సరైన మందును, సరైన మోతాదులో వాడుతూ,
ప్రతి ఆరు నెలలకు ఒక సారి పరీక్ష చేసుకుంటూ, వైద్యుల పర్యవేక్షణలో ఉండడం
అనేది థైరాయిడ్ లాంటి దీర్ఘకాలిక జబ్బుల విషయంలో చాలా ముఖ్యం.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.
-
43:25
Michael Franzese
1 hour agoThis Is the Most Important Thing I’ll Ever Say
9.1K8 -
LIVE
Barry Cunningham
2 hours agoPRESIDENT TRUMP TOURS JEROME POWELL SCENE OF THE CRIME AT THE FEDERAL RESERVE
2,927 watching -
LIVE
Sarah Westall
2 hours agoBlackmail, Power & Corruption: The Currency of the Empire - Epstein & more w/ Joachim Hagopian
329 watching -
45:56
The White House
2 hours agoPresident Trump Visits the Federal Reserve
19.2K14 -
36:14
Kimberly Guilfoyle
3 hours agoRussia Hoax Reality Check, Live! | Ep240
17.5K5 -
11:02
Preston Stewart
7 hours ago $0.18 earnedThailand–Cambodia Clash Erupts
3.5K3 -
LIVE
LFA TV
20 hours agoLFA TV ALL DAY STREAM - THURSDAY 7/24/25
1,349 watching -
1:07:35
vivafrei
4 hours agoWall Street Journal DOUBLING DOWN on Epstein! Lawyer in Canada DEBANKED! AND MORE!
99.6K27 -
4:42:20
Donut Operator
6 hours agoI'M BACK/ CRIME/ GAMEBOY CAMERA CHAD
100K5 -
9:51
Warren Smith - Secret Scholar Society
5 days agoThe Moment Tim Pool Discovered Why Andrew Wilson is so Unstoppable
38.8K26