పసుపు ప్రయోజనాలు Turmeric benefits #పసుపు #ప్రయోజనాలు #Turmeric #benefits #skin #meditation #heart

1 year ago
21

పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు.
పసుపు మన అందరి వంటింట్లో ఉంటుంది,
ప్రతి వండే కూరలో కాసింత పసుపు తప్పకుండ వేస్తారు.
పసుపు వంటకే పరిమితం కాకుండా పెళ్లిళ్లలో మరియు శుభకార్యాలలో వినియోగించటం జరుగుతుంది.
పసుపు అనేది అల్లం యొక్క జాతికి సంబంధించినది.
దక్షిణ ఆసియాలోని ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతున్న కర్కుమాలోంగా మొక్క యొక్క వేరు
నుండి లభించే సుగంధ ద్రవ్యం.
మొక్క యొక్క వేర్లు బల్బుల ఆకారంలో ఉంటాయి , ఇవి మూలవేరుని ఉత్పత్తి చేస్తాయి.

ఇవి కాల్చబడి, ఎండబెట్టి ఆపై హాల్ది అని పిలువబడే పసుపు పొడిగా చూర్ణం చేయబడతాయి.
ఆసియలో పసుపును అత్యధికంగా వినియోగించటం జరుగుతుంది.
మనదేశంలో ఆరోగ్యపరంగా చాలా కాలంగా పసుపును ఉపయోగిస్తూ వస్తున్నాము.
ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం పసుపు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనిరుజువు అయ్యింది.
పసుపులో కర్క్యుమిన్ అనే ఆక్టివ్ కాంపౌండ్ ఉంటుంది, దీని వలన చాలా ఆరోగ్య ప్రయోజనలు ఉన్నాయి.
మనము పసుపును సేవించినప్పుడు, దీనిలో ఉండే కర్క్యుమిన్ శరీరంలోని రక్తంలో సరిగా కలవదు.

అందుకే పసుపును మిరియాలతో తీసుకున్నట్లైతే మిరియాలలో ఉండే పైపెరిన్ కర్క్యుమిన్ను మన రక్తంలో ఎక్కువ మోతాదులో కలవటానికి సహాయపడుతుంది.

పసుపుకు సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాలను చూద్దాము.

పసుపు డయాబెటిస్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది,
పసుపు కాన్సర్ ను నిరోధించటం లో సహాయపడుతుంది,
పసుపు గుండెకు సంబంచిన రోగాలను తగ్గించడంలో సహాయపడుతుంది,
పసుపు లో ఉండే కర్క్యుమిన్ అల్జీమర్స్ రోగంను నయం చేయడానికి సహాయపడుతుంది.
ఆర్థరైటిస్ (కీళ్ల నొప్పులు) చికిత్సలో పసుపు సహాయపడుతుంది

డిప్రెషన్ బారినపడ్డ వారికి కూడా పసుపు సహాయపడుతుంది,
పసుపు చర్మ ఆరోగ్యాన్ని పెంచటంలో సహాయపడుతుంది,
పసుపు దీర్ఘకాలిక వ్యాధులనుంచి కాపాడటంలో సహాయపడుతుంది,
పసుపు ఆంటి యాక్సిడెంట్ గా పనిచేయటంలో సహాయపడుతుంది,
పసుపు ఆంటి ఇంఫ్లమ్మెటరీ గా పనిచేయటంలో సహాయ పడుతుంది,

పసుపు డయాబెటిస్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది
కొన్ని అధ్యయనాల ప్రకారం పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే కాంపౌండ్ డయాబెటిస్నునయం చేయడానికి లేదా నివారించడానికి సహాయపడుతుంది.

పసుపు లో ఉండే ఆంటీ – ఇంఫ్లమ్మెటరీ మరియు ఆంటియాక్సిడెంట్ గుణాల కారణంగా డయాబెటిస్ ను నిరోధించడంలో సహాయపడుతుంది.

పసుపు క్యాన్సర్ ను నిరోధించటం లో సహాయపడుతుంది
క్యాన్సర్ వ్యాధి వల్ల మన శరీరంలోని కణాలు అదుపు లేకుండా పెరుగుతాయి. క్యాన్సర్ లో వివిధ రకాలు ఉన్నాయి.
పసుపు లో ఉండే కర్క్యుమిన్ వివిధ రకాల క్యాన్సర్ల రకాల పై ప్రభావం చూపిస్తుంది. కణాల ఎదుగుదలను మరియు పురోగతిని కూడా ప్రభావితం చేస్తుంది.

ఇంతకూ ముందు చెప్పిన విధంగా పసుపును మిరియాలతో పాటు తీసుకుంటే మిరియాలలో ఉండే పైపరిన్ పసుపును క్యాన్సర్ను నయం చేయటానికి సహాయపడుతుంది.
ఇంతేకాకుండా క్యాన్సర్ మన దగ్గరికి రాకుండా కూడా నివారిస్తుందని కూడా ఆధారాలు ఉన్నాయి.
పసుపు గుండెకు సంబంచిన రోగాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
పసుపు లో ఉండే కర్క్యుమిన్ గుండె యొక్క ఆరోగ్యాన్ని మెరుగపరచటానికి సహాయపడుతుంది,
పసుపు గుండె లోని ఎండోతెలియం ను బాగా పనిచేసే విధంగా చేస్తుంది.
ఎండోతెలియం సరిగా పనిచేయకపోవడం వల్లనే మనకు గుండెకు సంబంచిన రోగాలు వస్తాయి.

గుండెకు సంబంచిన చాలా రకాలైన రోగాల ప్రక్రియలను ఆపటంలో మరియు వ్యతిరేకంగా పనిచేయటంలో పసుపు సహాయపడుతుంది.
పసుపు లో ఉండే కర్క్యుమిన్ అల్జీమర్స్ రోగంను నయం చేయడానికి సహాయపడుతుంది.
అల్జీమర్స్ డెమెన్షియా అనే రోగం యొక్క మరొక రూపం. 60–70% డెమెన్షియా రోగులు అల్జీమర్స్ బారిన పడే అవకాశం ఉంటుంది.
అల్జీమర్స్ రోగం లో మనుషులు జ్ఞాపకశక్తి ని కోల్పోతూ ఉంటారు. ఇది ఎక్కువగా వయసు పై బడిన వారిలో అంటే దాదాపు 60 సంవత్సరాల వారిలో ఈ రోగం వస్తుంది.

ఈ వ్యాధికి ఇంతవరకు ఎలాంటి చికిత్స లేదు, కేవలం లక్షణాలను తక్కువ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి.
ఈ రోగం బారిన పడ్డప్పుడు మెదడు వాపు మరియు ఆక్సీకరణం దెబ్బ తింటుంది.
పసుపులో ఉండే ఆంటీ – ఇంఫ్లమ్మెటరీ మరియు ఆంటియాక్సిడెంట్ గుణాలు అల్జీమర్స్ రోగం బారిన పడ్డ వారికి సహాయపడుతుంది.
ఆర్థరైటిస్ (కీళ్ల నొప్పులు) చికిత్సలో పసుపు సహాయ పడుతుంది.
ఆర్థరైటిస్ అనే వ్యాధి కీళ్ల నొప్పులకు సంబంధించినది. ఈ వ్యాధి లో దాదాపు 100 రకాలు ఉన్నాయి.
ఈ వ్యాధి వల్ల కీళ్లలో వాపు, నొప్పి మరియు బిరుసుతనం వస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు.
ఒక అధ్యయనం ప్రకారం 8–12 వారాల వరకు పసుపులో ఉండే కర్క్యుమిన్ను 1000mg/day తీసుకోవటం వల్ల ఆర్థరైటిస్ లక్షణాలైన నొప్పి మరియు వాపును తగ్గించటంలో సహాయపడింది.
ఈ వ్యాధికి ఎలాంటి చికిత్స లేదు కేవలం లక్షణాలను తగ్గించటమే ప్రస్తుతం ఉన్న మార్గం.
పసుపు పై ఇప్పటి వరకు కొన్ని పరోశోధనలు మాత్రమే జరిగాయి కాబట్టి ఒక నిర్ణయానికి రావటం మరియు పసుపు ఆర్థరైటిస్ను తగ్గిస్తుందని పూర్తిగా చెప్పలేము.
ఇంకా పెద్దమొత్తంలో పరిశోధనలు జరిగితే కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది

డిప్రెషన్ బారిన పడ్డ వారికి కూడా పసుపు సహాయపడుతుంది,
W H O ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా చాలా 30 కోట్ల మంది డిప్రెషన్ కారణంగా బాధ పడుతున్నారు.
కొన్ని క్లినికల్ ట్రయల్స్ ప్రకారం పసుపులో ఉండే కర్క్యుమిన్ ఆంటి డిప్రెసెంట్గా కూడా పనిచేస్తుందని తెలిసింది.
పసుపులో ఉండే కర్క్యుమిన్ డిప్రెషన్ తో బాధపడుతున్న వారికి చేసే చికిత్సలలో ఒక చికిత్స గా సహాయపడుతుంది.
పసుపులో ఉండే కర్క్యుమిన్ డిప్రెషన్ తో బాధపడుతున్న వారికి చేసే చికిత్సలలో ఒక చికిత్స గా సహాయపడుతుంది.

డిప్రెషన్ తో బాధపడుతున్న 60 మందిని మూడు గ్రూపులుగా విభజించారు
ఒక గ్రూప్ కు fluoxetine (20 mg) అనే ఆంటిడిప్రెసెంట్ ఇవ్వడం జరిగింది.
రెండవ గ్రూప్ కు కేవలం కర్క్యుమిన్ (1000 mg)ను ఇవ్వటం జరిగింది.
మూడవ గ్రూప్ కు fluoxetine మరియు కర్క్యుమిన్ ను ఇవ్వటం జరిగింది.
ఈ పరిశోధన ప్రకారం fluoxetine మరియు కర్క్యుమిన్ ను కలిపి తీసుకున్న వారిలో చాలా మార్పు కనిపించింది.
దీనిని బట్టి కర్క్యుమిన్ డిప్రెషన్ తో బాధపడుతున్న వారికి ఆంటిడిప్రెసెంట్ గా సహాయపడుతుందని చెప్పవచ్చు.

పసుపు దీర్ఘ కాలిక వ్యాధులనుంచి కాపాడటంలో సహాయపడుతుంది

మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ కారణంగా అనేక దీర్ఘ కాలిక రోగాలైన డయాబెటిస్ మరియు కాన్సర్ వస్తాయి
పసుపులో ఉండే ఆంటి యాక్సిడెంట్ మరియు ఆంటి ఇంఫ్లమ్మెటరీ గుణాల కారణంగా దీర్ఘ కాలిక రోగాలైన ఊబకాయం,
డయాబెటిస్, కాన్సర్, డిప్రెషన్, ఆర్థరైటిస్, చర్మ రోగాలపై చాలా బాగా ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు.

పసుపు పై ఇంకా బాగా పరిశోధనలను చేస్తే వీటి వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకునే అవకాశం ఉంది
పసుపు ఆంటి యాక్సిడెంట్ గా పనిచేయటంలో సహాయపడుతుంది

ఆక్సీకరణ వల్ల మన శరీరానికి చాలా నష్టం జరుగుతుంది మరియు అనేక రోగాలకు దారి తీస్తుంది.

పసుపు లో ఉండే ఆంటి యాక్సిడెంట్ గుణాల కారణంగా ఫ్రీ రాడికల్స్ నుంచి మన శరీరానికి జరిగే నష్టం నుంచి కాపాడటంలో సహాయపడుతుంది
పసుపు ఆంటి ఇంఫ్లమ్మెటరీ గా పనిచేయటంలో సహాయ పడుతుంది
ఇంఫ్లమేషన్ అంటే శరీరం వాపు కి గురి అవ్వటం,
ఈ వాపు కారణంగానే చాలా రకాలైన దీర్ఘ కాలిక సమస్యలు వస్తాయి. పసుపు లో ఉండే ఆంటి ఇంఫ్లమ్మెటరీ గుణాల కారణంగా అనేక దీర్ఘ కాలిక వ్యాధుల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.

Loading comments...