నడుము నొప్పికి అద్భుత పరిష్కారం చిట్కాలు యోగాసనాలు ఆయుర్వేద చికిత్స

7 months ago
9

నడుము నొప్పికి అద్భుత పరిష్కారం చిట్కాలు యోగాసనాలు ఆయుర్వేద చికిత్స
అందరికీ నమస్కారం,
నడుము నొప్పికి అద్భుత పరిష్కారం
చిట్కాలు యోగాసనాలు ఆయుర్వేద చికిత్స

నడుం నొప్పి బాధిస్తోందా. ? దీర్ఘకాలిక నడుము నొప్పికి అయితే ఈ చిట్కాలు. మరియు
ఈ యోగాసనాలు అద్భుత పరిష్కారం నడుం నొప్పిని దూరం చేసుకోండి

.
సమస్య బయటపడతారు.

ఈ మధ్యకాలంలో నడుము, మెడ, వెన్నునొప్పి వంటి అనేది సర్వసాధారణమైపోయింది,
వీరిలో 45 ఏళ్లు దాటని వారూ ఉండడం బాధాకరం. నడుమునొప్పి కి కారణాలు అనేకం,
అయితే, జీవనఅలవాట్లు, ఉద్యోగ కారణమో, నిరంతరం గ్యాడ్జెట్స్ వాడకమో
ఈ సమస్యకు కారణమవుతుంది. వీటితో పాటు మరికొన్ని ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి.
అవేంటో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నడుమునొప్పి
సమస్యను నుంచి ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

కంప్యూటర్ ముందు కూర్చోవడం..

ప్రస్తుతం చాలా మంది కంప్యూటర్స్ పైనే వర్క్ చేస్తున్నారు.
ఈ సమయంలో కూర్చునే పొజిషన్ సరిగా ఉండేలా చూసుకోవాలి.
లేదా సమస్య ఎక్కువవుతుంది. మానిటర్ కళ్లకు సమానంగా ఉండేలా చూసుకోవాలి.
తలభాగం సరిగా ఉండేలా చూడాలి. అదేవిధంగా కళ్లకు,
మానిటర్‌కు మధ్య కనీసం 20 అంగుళాల దూరం ఉండాలి.
మణికట్టు కూడా తిన్నగా ఉండేలా
మోచేతులు 90 డిగ్రీల యాంగిల్‌లో ఉండేలా చూసుకోవాలి.
కీబోర్డ్, మౌస్ సమాన ఎత్తులోనే ఉంచుకోవాలి.

అదే విధంగా
కూర్చునేటప్పుడు వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి'
నడుము వెనుకభాగం కుర్చీ వెనుకభాగానికి తాకేలా ఉండాలి.
పాదాలు పూర్తిగా నేలను తాకాలి.
కుర్చీ ఎత్తుగా ఉంటే పాదాల కింద ఎత్తు పెట్టుకోవాలి.
వీపు వంపు దగ్గర చిన్న దిండు, లేదా టవల్, చున్నీ లాంటి వాటిని పెట్టుకోవచ్చు.
వీటితో పాటు అరగంట కంటే ఎక్కువసేపు సిస్టమ్ ముందు కూర్చోకోకూడదు.
ఒకవేళ మీ పనే అది అయితే, మధ్య మధ్యలో లేచి అటూఇటూ నడవండి.

హ్యాండ్‌బ్యాగ్ వాడుతున్నారా..

ఆడవారిలో నడుమునొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయి.
ఇందులో ఒకటి హ్యాండ్ బ్యాగు.. బ్యాగుని మనం ఎప్పుడూ ఒకేవైపు వేేసుకుంటుంటాం.
దీని వల్ల భుజాలు వంగిపోయి నొప్పి వస్తుంటుంది.

ఈ ఎఫెక్ట్ నడుముపై కూడా పడుతుంది
అందుకోసం బ్యాగుని తరచూ మారుస్తూ ఉండాలి.
దీని వల్ల ఉపశమనం ఉంటుంది. వీలుంటే బ్యాక్ ప్యాక్ బ్యాగ్స్ ట్రై చేయడం కూడా మంచిదే..

జాగ్రత్తలు ఇలా తీసుకోండి..

సాధారణంగా ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చోవడం,
ఎక్కువ దూరం బైక్ డ్రైవ్ చేయడం, కారులో ప్రయాణించడం,
వెన్నుకి దెబ్బ తగలడం, వెన్నుకి సంబంధించిన సమస్యల
వల్ల కూడా నడుము నొప్పి వస్తుంటుంది.

స్త్రీలలో గర్భధారణ సమయంలో నడుము నొప్పి అవకాశం ఉంది
అదే విధంగా వెన్నుపై అధిక ఒత్తిడి ఉన్నా ఈ సమస్య ఎదురవుతుంది
కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
సాధారణంగానే సమస్యను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

కొన్ని సందర్భాల్లో నడుం నొప్పి ఉన్నప్పటికీ దానికి వెన్నుపాముతో ఎటువంటి సంబంధం ఉండదు.
అలాగని అశ్రద్ధ చేయడం పనికిరాదు. ఇలాంటప్పుడు ఇతరత్రా సమస్యలేవైనా ఉండవచ్చు.
అయితే నొప్పి లక్షణాన్ని బట్టి అది ఏ అవయవానికి సంబంధించిన సమస్యో కొంతవరకు నిర్థారించవచ్చు.

కొన్ని గృహ చిట్కాలతో నడుం నొప్పిని దూరం చేసుకోవచ్చు.

శొంటి కషాయానికి (అరకప్పు) ఆముదాన్ని (రెండు చెంచాలు)
కలిపి రెండు పూటలా వారం లేదా పది రోజులపాటు తీసుకోవాలి.

వావిలి ఆకు కషాయాన్ని పూటకు అర కప్పు చొప్పున మూడు పూటలా పుచ్చుకోవాలి.

పారిజాతం ఆకుల కషాయాన్ని పూటకు అర కప్పు చొప్పున మూడు పూటలా తీసుకోవాలి.

ఆయుర్వేద చికిత్స

నడుమునొప్పిని ఆయుర్వేదం లో కటిశూల అంటారు,
ఇదొక వాత ప్రధాన వ్యాధి. దీనికి స్నేహనం, స్వేదనం, అగ్నిదీపనం,
వస్తకర్మ, వేదనాశ్యామక, వాతనాశిక అనేవి ఔషధాలు.
న‌డుము నొప్పి వ‌చ్చిందంటే చాలు
పెయిన్ కిల్లర్స్, నొప్పి నివార‌ణ కొరకు మందులు వాడ‌డం నేడు అధిక‌మైపోయింది.

ఈ క్రమంలో వాటి వ‌ల్ల వ‌చ్చే సైడ్ ఎఫెక్ట్‌ల‌ను గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు.
అయితే అలాంటి ఇంగ్లిష్ మెడిసిన్ వాడాల్సిన ప‌ని లేకుండానే కింద ఇచ్చిన
కొన్ని స‌హ‌జ సిద్ధమైన చిట్కాలను పాటిస్తే చాలు. న‌డుము నొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు.

ఒక కప్పు పాలలో తేనె వేసుకొని రోజూ తాగడం వల్ల నడుము నొప్పి రాకుండా చూసుకోవచ్చు.

నొప్పిగా ఉన్న ప్రదేశంలో ఐస్ ముక్కతో కాపడం పెట్టడం వల్ల ఉపశమనం పొందవచ్చు.

తెల్ల చామంతి పూలతో చేసిన కషాయంతో నడుము నొప్పిని తగ్గించవచ్చు.

రెండు కప్పుల నీటిలో చిన్నగా తరిగిన అల్లం ముక్కలను వేసి, ఒక కప్పు అయ్యే వరకూ మరిగించాలి.
వడగట్టి, చల్లార్చిన తర్వాత తేనె కలుపుకొని తాగితే నడుము నొప్పి తగ్గిపోతుంది.

నొప్పి ఉన్న చోట అల్లం పేస్ట్‌ను కాసేపు ఉంచినా మంచి ఫలితం ఉంటుంది.

రెండు చెంచాల గసగసాల పొడిని గ్లాసు పాలలో కలుపుకొని రోజుకు రెండుసార్లు తాగినా నొప్పి తగ్గుతుంది.

దీర్ఘకాలిక నడుము నొప్పికి ఈ యోగాసనాలు అద్భుత పరిష్కారం!

Yoga For Chronic Back Pain- నడుము నొప్పికి యోగాసనాలు
నడుమును నొప్పిని తగ్గించే కొన్ని ప్రభావవంతమైన యోగాసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Bridge Pose- సర్వంగాసనం ( సేతుబంధ )
ఈ యోగా భంగిమ మీ శరీరాన్ని బలోపేతం చేయడంలో,
శరీర సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఈ భంగిమలో ఉన్నప్పుడు వెన్నుభాగం లోపలికి వంగుతుంది,
ఛాతీ బయటకు తెరుచుకుంటుంది.

శరీరాన్ని సాగదీయడం కోసం
ఒక వంతెనను ఏర్పర్చినట్లు ఉంటుంది. ఈ భంగిమ ఛాతీ, మెడ,
వెన్నెముక, తుంటిని సాగదీస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది,
వెన్ను సమస్యలను చికిత్స చేస్తుంది.

Child Pose- బాలాసనం
ఇది చాలా సులభమైన ఆసనం, ఈ ఆసనం సాధన చేయడం ద్వారా మీరు
మీ వెన్నుభాగాన్ని సాగదీయవచ్చు. రోజంతా పనిచేసి అలసిపోయిన రోజున,
మీరు పడుకునే ముందు బాలాసనం వేయండి. మీకు ఒళ్లు నొప్పులు,
వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగి విశ్రాంతిగా అనిపిస్తుంది.
హాయిగా నిద్రపోగలుగుతారు.

Cobra Pose- భుజంగాసనం
భుజంగాసనం ప్రధానంగా ఉదర భాగాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది.
ఇది రక్త ప్రసరణలో సహాయపడుతుంది, వెన్నుముకను బలపరుస్తుంది,
గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. వెన్నునొప్పి, శ్వాసకోశ సమస్యల
నుండి ఉపశమనం కలిగిస్తుంది, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను
నయం చేస్తుంది. ఈ యోగా భంగిమ పొట్ట కొవ్వును తగ్గించడంలోనూ ప్రభావవంతంగా ఉంటుంది.

Cat Cow Pose- చక్రవాకసనం
ఈ సున్నితమైన ఆసనం వెన్నుభాగంలో కదలికను కలిగిస్తుంది,
వెన్నెముకను సాగదీస్తుంది. ఈ భంగిమను సాధన చేయడం వల్ల
మీ మొండెం, భుజాలు మరియు మెడ కూడా సాగుతుంది.
ఈ యోగాసనంతో మీ వెన్నెముకను సున్నితమైన మసాజ్
లభించడం ద్వారా వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఒక నిమిషం పాటు ఈ ఆసనం వేయండి.

Downward facing Dog- అధో ముఖ ఆసనం
ఈ సాంప్రదాయిక ఆసనం మీకు విశ్రాంతిని, పునరుజ్జీవనం కలిగిస్తుంది.
వెన్నునొప్పి ఉన్నప్పుడు ఈ భంగిమను సాధన చేయడం వల్ల
మీకు హాయిగా అనిపిస్తుంది, నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
ఇది శరీరంలో అసమతుల్యతను తొలగించడానికి,
సత్తువను పెంచడానికి సహాయపడుతుంది.

Loading comments...