కరుణ ఆరోగ్యం విషమం: తమిళనాడు పోలీసులు హైఅలర్ట్

OneIndia_TeluguPublished: August 7, 2018
Published: August 7, 2018

The condition of ailing DMK patriarch M Karunanidhi continues to remain critical, Kauvery Hospital's latest medical bulletin said as heavy police has been deployed inside.

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం బాగా విషమించిందని కావేరీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి లోపల, బయట పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. తమిళనాడు పోలీసులు హైఅలర్ట్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. కావేరీ ఆసుపత్రి వర్గాలు సాయంత్రం ఆరు గంటలకు మరోసారి కరుణ హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నాయి.మరోవైపు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ముఖ్యమంత్రి పళనిస్వామితో భేటీ అయ్యారు. చీఫ్ సెక్రటరీ గిరిజ వైద్యనాథన్‌తోను భేటీ కానున్నారు. వరుస పరిణామాలు కరుణ అభిమానులు, డీఎంకే కార్యకర్తలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఆసుపత్రి వద్దకు కరుణ కుటుంబ సభ్యులు, మిత్రులు చేరుకున్నారు.
#mkarunanidhi
#dmk
#kauveryhospital
#chennai
#tamilnadu
#stalin
#kanimozhi

Be the first to suggest a tag

    Comments

    0 comments